ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకెందుకు ఆలస్యం - టీడీపీ కుటుంబంలో చేరండి : లోకేశ్ - TDP MEMBERSHIP REGISTRATION 2024

తెలుగుదేశం సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున స్పందన

TDP Membership Registration 2024
TDP Membership Registration 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 12:35 PM IST

TDP Membership Registration 2024 : తెలుగుదేశం సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్ విధానంలో దీనిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నాయకులు, శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పాతవారు రెన్యువల్‌ చేసుకుంటుండగా కొత్తవారిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే 25 లక్షల సభ్యత్వాలు దాటాయి. దీనిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 స్వచ్ఛందంగా ఒక సంక్షేమ ఉద్యమంలా సాగుతోందని మంత్రి లోకేశ్​ స్పష్టం చేశారు. 25 లక్షల సభ్యత్వాలు దాటడం చాలా సంతోషంగా ఉందని వివరించారు. ఈ ఒక్కరోజే 1,80,000 సభ్యత్వాలు నమోదు కావడం టీడీపీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. ఈ లింక్ క్లిక్ చేసి wa.me/9053419999?tex వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ కుటుంబంలో చేరాలని సంక్షేమ ఫలాలు అందుకోవాలని లోకేశ్ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.

Lokesh Tweet Tdp Membership 2024 :మరోవైపు సభ్యత్వ నమోదులో రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నారు. వంద చెల్లించినవారికి గతంలో ఉన్న రూ.2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు పది వేలు ఇవ్వనున్నారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందించనుంది.

రూ.100తో ఐదు లక్షల బీమా- ఘనంగా ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details