Minister Lokesh Help to Poor Student in Guntur District :విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. గత ప్రభుత్వం (YSRCP Govt) విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా ఆమెకు విదేశీ విద్య ద్వారా సాయం అందలేదు. దీంతో కార్తీక చదువుకు సహాయం అందించాలని ఆమె తండ్రి ప్రజాదర్బార్ లో లోకేశ్‌కు ఇటీవల వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 14వ తేదీ లోపు ఫీజు చెల్లించి కార్తీక కళాశాలకు వెళ్లాల్సి ఉంది.
వైద్య విద్యార్థినికి మంత్రి లోకేశ్ ఆర్థికసాయం - Minister Lokesh Help
Minister Lokesh Help to Poor Student in Guntur District : విదేశాల్లో చదువుతున్న వైద్య విద్యార్థినికి మంత్రి లోకేశ్ ఆర్థికసాయం అందించారు. గత ప్రభుత్వ నిబంధనలతో కార్తీక విదేశీ విద్య సాయానికి దూరం అయ్యింది. లోకేశ్ నిర్వహించే ప్రజాదర్బార్‌లో సహాయం చేయాలని ఆమె తండ్రి కోరారు. ఇందుకు స్పందించిన లోకేశ్ తన సొంత నగదు రూ. 1.43 లక్షలు ఆర్థిక సహాయంగా అందజేశారు.
lokesh_helped (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 10:11 AM IST
ప్రస్తుతానికి విదేశీవిద్య పథకానికి (Videsividya Scheme) నూతన మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో నేరుగా సహాయం అందించే అవకాశం లేదు. దాంతో లోకేశ్ తన సొంత నగదు రూ. 1.43 లక్షలు విద్యార్థినికి ట్యూషన్ ఫీజు కింద సమకూర్చారు. ఇందుకు సంబంధించిన నగదును ఉండవల్లి నివాసంలో విద్యార్థినికి అందజేశారు.