Minister Jupally Visit Nitham : ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పర్యాటక, ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) సంస్థ, మాదాపూర్ శిల్పారామంను మంత్రి జూపల్లి(Minister Jupally) సందర్శించారు. మొదటగా నిథమ్ అకడమిక్ బ్లాక్‌లోని క్లాస్ రూంలు, హాస్పిటాలిటీ బ్లాక్‌లోని కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్ట్రారెంట్ మాక్ రూమ్స్, తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి బెంచ్‌పై కూర్చొని విద్యార్థులతో మంత్రి సంభాషించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు.
Jupally on Tourism Development : అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా నిథమ్ సంస్థను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, హోటల్ మేనేజ్‌మెంట్ హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసుకున్న పట్టభద్రులైన విద్యార్థులు సులువుగానే ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు.
విద్యార్థులు కూడా తమకు అందిస్తున్న ప్రపంచ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్య సద్వినియోగం చేసుకొని తెలంగాణ పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని, నైపుణ్యాలను పెంచుకోవాలని జూపల్లి సూచించారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూజీసీ స్కేల్ ప్రకారం వారికి వేతనాలు అందేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఆత్మసాక్షి ఉంటే రాజీనామా చేయాలి - హరీశ్‌రావుకు జూపల్లి సవాల్