GADWAL MLA PARTY CHANGE UPDATES :రాష్ట్ర రాజకీయాల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతున్నారన్న వార్తలు వైరల్‌గా మారాయి. ఇటీవల శాసనసభ లాబీలో కేటీఆర్‌ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి, కేసీఆర్‌తో భేటీ తర్వాత తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.
బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధం : తెల్లం వెంకట్రావు - TellamGives Clarity On Party Change
కథనాలు అవాస్తవం :ఈ ప్రచారానికి ఊతమిస్తూ గద్వాల ఎమ్మెల్యే సైతం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలో జరిపిన భేటికి హాజరు కాలేదు. ఈప్రచారం నేపథ్యంలో ఇవాళ ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఇవాళ గద్వాలలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ప్రత్యేకంగా ఆయనతో భేటి అయ్యారు. బండ్ల కాంగ్రెస్‌ను వీడి వెళ్లడం లేదని, ఆయన పార్టీలోనే ఉన్నట్లు వెల్లడించారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని జూపల్లి వెల్లడించారు.
కారణం ఇదేనా :మరోవైపు తానెందుకు అసంతృప్తితో ఉన్నారో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జూపల్లికి స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌లో చేరానని, నియోజక వర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఎమ్మెల్యేను అసంతృప్తికి గురిచేసినట్లుగా సమాచారం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి రూ.105 కోట్లు మాత్రమే కేటాయించారు.
ప్రస్తుతం ర్యాలంపాడు జలాశయానికి లీకేజీ సమస్యల కారణంగా 4 టీఎంసీల జలాశయంలో 2 టీఎంసీల నీళ్లే నిల్వ ఉంటున్నాయి. గుడెందొడ్డి జలాశయం కింద 60వేల ఎకరాలకు సైతం సాగునీరు అందడం లేదు. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే కేటాయించిన నిధులు చాలవు. గట్టు ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో కేటాయింపులే లేవు. జూరాలకు సైతం అత్యల్ప నిధులు దక్కాయి. ఇవే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఎమ్మెల్యే ప్రభుత్వం ముందు ఉంచారు. వాటన్నింటికీ బడ్టెట్‌లో కేటాయింపులు గాని, సమస్యల పరిష్కారం కోసం నిధులు గాని దక్కకపోవడంతో బండ్ల అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది.
గద్వాల ఎమ్మెల్యే అసంతృప్తికి మరో కారణం నియోజకవర్గంలో పార్టీలో పెరిగిపోయిన ఆధిపత్య పోరని తెలుస్తోంది. ఒకే పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మరోవైపు నియోజకవర్గ ఇంచార్జ్ సరిత వర్గాల మధ్య అంతర్గత పోరు ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై మౌనంగానే ఉండటంతో ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వర్గపోరు, ఎమ్మెల్యే వర్గం అనుచరులపై కేసులు ఇతర అంశాలపైనా మీడియా జూపల్లి కృష్ణారావును ప్రశ్నించగా, నియోజక వర్గ అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని మిగిలినవన్నీ అప్రాధాన్య అంశాలుగా ఆయన కొట్టిపారేశారు.
గద్వాల్ ఎమ్మెల్యే యూటర్న్ - కాంగ్రెస్‌ను వీడి మళ్లీ కారెక్కిన కృష్ణమోహన్ రెడ్డి - GADWAL MLA REJOINED BRS
అసెంబ్లీలో బీఆర్ఎస్కు నేను ఒక్కడినే చాలు : మంత్రి కోమటిరెడ్డి - chitchat with minister komatireddy