Minister Jogi Ramesh Son Rajeev Overaction On NDA Alliance Leaders :మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. తాజాగా ఉయ్యూరులో జరిగిన ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే
తొడకొట్టి మీసాలు మెలేసి జోగి తనయుడి వీరంగం - ఎన్డీఏ శ్రేణులను రెచ్చగొట్టే యత్నం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం : ఎన్డీఏ కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry), పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్ (Bode Prasad), కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలంతా కలిసి ఉయ్యూరులో బుధవారం ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ర్యాలీ గురజాల డొంక రోడ్డు వద్ద ఉండగా కూటమి శ్రేణులు ముందుగా ద్విచక్ర వాహనాలతో ఉయ్యూరులోకి వచ్చారు.
రణరంగాన్ని తలపిస్తోన్న ఎన్నికలు - పోలీసుల సాక్షిగా ఆ దాడులకు సూత్రధారులెవ్వరు? - POLITICAL ATTACKS IN ANDRA PRADESH
'జై జగన్' అంటూ నినాదాలు :విజయవాడ-మచిలీపట్నం ప్రధాన రహదారిపై మసీదు ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వాహనాల ర్యాలీ రాగానే అక్కడే అనుచరులతో ఉన్న మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ కూటమి శ్రేణులను రెచ్చగొట్టేందుకు యత్నించాడు. సౌండ్ బాక్సుల్లో పెద్దగా జగన్ పాటలు వేశాడు. అనుచరులు కొందరు రోడ్డుకు రెండు వైపులా నిలబడి అధికార పార్టీ జెండాలు పట్టుకొని 'జై జగన్' అని నినాదాలు చేశారు.
'అబ్బయ్యా ఇదేందయ్యా?!'- కాంగ్రెస్ వాహనంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి - YSRCP Attack
మీసాలు మెలేసి 'దమ్ముంటే చూసుకుందాం రండి' అని సవాలు :ఇదే సమయంలో ఇంకొందరు వాహనాల ర్యాలీ మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినా సంయమనం పాటించి కూటమి శ్రేణులు వెళ్తుంటే ర్యాలీ చివర్లో కారును రోడ్డుపైనే ఆపిన రాజీవ్ డోర్ తీసి దానిపై నిలబడి కూటమి శ్రేణులను ఉద్దేశించి మీసాలు మెలేశాడు. వైఎస్సార్సీపీ జెండా ఊపుతూ తొడగొట్టి 'దమ్ముంటే చూసుకుందాం రండి' అని సవాలు విసిరాడు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని వెళ్లిపోవాలని సూచించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పెద్దిరెడ్డి బంధువులు, కార్యకర్తలు నన్ను హతమార్చేందుకు యత్నించారు: రామచంద్రయాదవ్ - YSRCP Attacked BCYP Ramachandra