Anam Ramanarayana Reddy Comments: ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. సచివాలయం అనేదే అప్పటి సీఎం జగన్ మరచిపోయారని, స్వయంగా ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోతే మంత్రులు ఎలా వస్తారని ధ్వజమెత్తారు.
జగన్ అనుయాయులకు వేల ఎకరాలు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి చూశామన్నారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడి బెదిరించారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా చేశారని ఆరోపించారు. దీంతోపాటు గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా వేల కోట్ల నష్టం మిగిల్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్లపాటు సాగిన విధ్వంస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
'కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాదరణను ఓర్వలేక వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారాలు' - YSRCP False Propaganda on tdp
రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని, వైఎస్సార్సీపీ నిర్లక్ష్య ధోరణితో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని ఆనం మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉన్నట్లు తెలిపారు. పనుల జాప్యం వల్ల నిధులు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ దోపిడీపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
"వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేసింది. సచివాలయం అనేదే అప్పటి సీఎం జగన్ మరచిపోయారు. స్వయంగా సీఎం సచివాలయానికి రాకపోతే మంత్రులు ఎలా వస్తారు. నిర్మాణాలు ఎక్కడ నిలిచిపోయాయో.. ఇవాళ్టికి అక్కడే ఉన్న పరిస్థితి.ల నిలిచిన నిర్మాణ పనులన్నీ మళ్లీ మొదలుపెట్టే పనిలో ఉన్నాం. కాలం గడిచిన కొద్దీ నిధుల వ్యయం కూడా పెరిగిన పరిస్థితి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతాయి." -ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి
వైఎస్సార్సీపీ నేతల నిర్వాకం - బడిని కబ్జా చేసి బ్యాంకులో తాకట్టు పెట్టారు - Govt School Acquisition