Minister Anagani Satya Prasad About Flamingo Festival : కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించిన ఫ్లెమింగో ముగింపు ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, విజయశ్రీ, సునీల్‌కుమార్, రామకృష్ణ, సుధీర్‌రెడ్డి, కొండయ్య తదితరులు వీక్షించారు.
గత ఐదేళ్లలో పక్షుల పండుగను నిర్వహించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందన్న మంత్రి అనగాని కూటమి ప్రభుత్వం ఎంతో వైభవంగా వేడుకల్ని నిర్వహించిందన్నారు. పక్షుల పండుగకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పిస్తామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
పులికాట్ ముఖద్వారాల పూడికతీతకు రూ.100 కోట్లు:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో కొలువుదీరిన తర్వాత పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీతకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ - రెండోరోజు అదే జోరు - భారీగా తరలివచ్చిన పర్యాటకులు
పక్షుల పండుగ చివరి రోజు సోమవారం నేలపట్టులో సందర్శకుల జోరు తగ్గలేదు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సందర్శకులు నేలపట్టుకు చేరుకుని విహంగాలను వీక్షించారు. అతిథి గృహాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నేలపట్టు పక్షుల కేంద్రానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులతో కలిసి చేరుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించి సందర్శకులతో మాట్లాడారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో పండుగ ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
Movie Actors in Flamingo Festival Sullurpeta :ఫ్లెమింగో ఫెస్టివల్ సోమవారం ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరి రోజు ప్రముఖ హీరోయిన్లు ఉప్పెన ఫేం కృతిశెట్టి, విరూపాక్షి ఫేం సంయుక్త మీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సింగర్ మంగ్లీ, ఢీ తారాగణం, యాంకర్ రవి, కావ్య తదితరులు సందడి చేశారు.
అరుదైన అందాలు - పక్షి ప్రేమికులకు పండగే