Minister Adimulapu Suresh Escort Vehicle Collided Auto One Person Died :జాతీయ రహదారిపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బుధవారం దోర్నాలలో సీఎం జగన్(CM Jagan) పర్యటన ఉండటంతో ఆదిమూలపు సురేష్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ(Vijayawada) నుంచి మార్కాపురం వస్తున్నారు. ఈ సమయంలో జిల్లాలోని త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి వద్ద మంత్రి ఎస్కార్ట్ వాహనం ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్- ఐదుగురు సజీవ దహనం- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
Adimulapu Suresh Escort Collision One killed :ప్రమాద సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) ముందు వెళుతున్న వాహనంలో ఉన్నారు. ప్రమాద విషయం తెలిసినా మంత్రి ఆదిమూలపు సురేష్ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోవడం కొసమెరుపు. మంత్రి వ్యవహారశైలిపై స్థానికులు విమర్శిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని త్రిపురాంతకం(Tripuranthakam) మండలం రాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడిగా పోలీసులు(police) గుర్తించారు. ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం మూడు ఫల్టీలు కొట్టింది. ట్రాలీ ఆటో(Traly auto) నుజ్జునుజ్జు అయింది.