Milan 2024 in Visakha : విశాఖ తీరంలో మిలన్ 2024 విన్యాసాల సందడి మొదలైంది. ఈ విన్యాసాల్లో దాదాపు 50 దేశాలు పాల్గొంటుండగా, ఇప్పటికే పలు దేశాల నేవీ బృందాలు సాగర నగరానికి చేరుకున్నాయి. వివిధ దేశాల యుద్ధ నౌకలు, హెలీకాప్టర్లు, విమానాలు, విన్యాసాలకు రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈనెల 22న జరగనున్న సిటీ పరేడ్ నగరవాసులకు కనువిందు చేయనుంది. విశాఖలో జరిగే మిలన్ 2024నౌకాదళ విన్యాసాల్లో వివిధ దేశాల ప్రతినిధులు నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వచ్చేశారు. తొలిదశ హార్బర్ దశ 19 నుంచి 23 వరకు, సముద్రపు దశ 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. 22న మిలన్ 2024 సిటీ పరేడ్‌లో వివిధ దేశాల నౌకాదళ బృందాలు పాల్గొంటున్నాయి.
గత రెండు రోజులుగా ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ను పెద్ద సంఖ్యలో నగర వాసులు వీక్షిస్తున్నారు. విశాఖ చేరుకున్న భారత్ నౌకాదళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విరాట్ ఈ రెండు యుద్ధ నౌకలు మిలన్ 2024లో ప్రధాన అకర్షణగా ఉన్నాయి. వీటితోపాటుగా దాదాపు 20 యుద్ధ నౌకలు, ఎంఐజీ 29K మరియు పీ8I సహా దాదాపు 50 విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. విన్యాసాలు గగన తలంలో చూపరులకు గగుర్పాటు కలిగించేలా సాగనున్నాయి.
Indian Navy maneuvers : భారత నౌకాదళ విన్యాసాలను విడుదల చేసిన నేవి