Matrimony Frauds in Telangana: ఏపీలోని కర్నూలు జిల్లా గడివేములకు చెందిన మద్దుగారి చంద్రకాంత్ చిన్నతనం నుంచే మోసాలు చేయడం వృత్తిగా చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడ సమీపాన తాడేపల్లిలో ఉండేవాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడంతో మోసాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. మ్యాట్రిమోని(Matrimony Cyber Fraud), వ్యాపారంలో పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో బాధితులకు ఆన్‌లైన్‌లో దగ్గర అవడం ప్రారంభించాడు. తాను నివసించే ప్రాంతంలో అందరికీ డాక్టర్‌నని నమ్మిస్తూ వారి వద్ద చిన్నా చితకా డబ్బు వసూలు చేసేవాడు. ఆ తర్వాత తన మోసాలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు విస్తరించాడు.
Cyber Crime Cases in Hyderabad : హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాల్లో ఫార్మసీ ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు అవసరమని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో వ్యక్తులను సంప్రదిస్తూ డబ్బు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే 2021లో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్‌కు చెందిన నట్ట భవాణి అలియాస్ మద్దుగారి భవాణితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో భవాణి విజయవాడకు మకాం మార్చి ఇద్దరూ కలిసి మోసాలు మొదలుపెట్టారు. బ్యాంకు ఖాతాలు, పదుల సంఖ్యలో సిమ్‌కార్డులు సంపాదించారు. చంద్రకాంత్ 2023లో షాదీ.కామ్‌లో డాక్టర్, వ్యాపారవేత్త పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు.
కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్‌సైట్, భారీగా నిధుల సేకరణ - రాజస్థాన్‌లో నిందితుడి అరెస్ట్
Matrimonial Frauds Hyderabad: ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ చంద్రకాంత్(Online Cyber Crime in Telangana) ప్రొఫైల్ చూసి సంప్రదించింది. కొద్ది రోజుల పరిచయం తర్వాత ఏపీ, కర్ణాటక, తెలంగాణలో తాను ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పాడు. దీని కోసం ఆదాయపు పన్ను సమస్య కారణంగా బ్యాంక్ ఖాతాల్లోని రూ.25 కోట్లు స్తంభించిపోయాయని నమ్మించాడు. ఇందుకు ఫోర్జరీ చేసిన ఎస్‌బీఐ ఏటీఎం స్లిప్పులు, బెల్లంపల్లిలో ఆసుపత్రి నిర్మాణంలో ఉందంటూ నకిలీ ఫొటోలు చూపించాడు.