Massive Theft in Medchal District : వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా రెండు కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. చౌదరిగూడలోని మక్త గ్రామంలోని నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో భద్రపరిచిన రూ.2 కోట్ల 2 లక్షలతో పాటు 28 తులాలు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నాగభూషణం శంకర్‌పల్లిలో 10 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం చేసుకున్నాడని, అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నాగభూషణం డ్రైవర్‌పై అనుమానంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.