Many Electrical Accidents Happening in State : రాష్ట్రంలో కరెంట్ తీగలు యమ పాశాలుగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలు ఎంత చెప్పినా వారి తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలే ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో రమేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగను తాకి రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రమేష్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం తెగిపడిన విద్యుత్ తీగలను సరిచేయాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రమేష్ విద్యుత్ షాక్తో మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కరెంట్ తీగ తగిలి కుమార్తె - కాపాడబోయి తండ్రి ప్రాణాలొదిలారు - Two people died on electric shock