Man Died With Heart Attack In Temple At Hyderabad KPHB : గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలానికి చెందిన కె.విష్ణు వర్ధన్(31), హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ ఆంజనేయుడిని దర్శించుకునే అలవాటు ప్రకారం సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేశాడు.
ఆ తర్వాత ధ్యాన మందిరం మెట్లపై కూర్చుని సేద తీరాడు. కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ఫిల్టర్ దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. భక్తులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోపే విష్ణు వర్ధన్ మరణించాడు. ఇదంతా గుడిలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఇతడు చాలా రోజుల నుంచి వైరల్ జ్వరంతో బాధపడినట్లు తెలిసింది. విష్ణువర్ధన్ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షలు చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరి కొద్ది సేపట్లో శ్రీనివాసుడి దర్శనం- అంతలోనే గుండెపోటు