A Lover Attack on Young Woman With Knife :సమాజంలో రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేమించమని వెంటపడుతూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తారు కొందరు. ప్రేమ అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు మరికొందరు. అమ్మాయి దక్కలేదనే కక్షతో పలుమార్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ ఉన్మాదంలో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధి గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని వెంటాడిన యువకుడిని ఆ యువతి నిరాకరించింది. ఆ కోపంతో సదరు యువతిపై ఆమె మాజీ ప్రియుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపైనా దాడికి తెగబడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :కర్ణాటక బీదర్‌కు చెందిన రాకేశ్ అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్లో నివాసం ఉంటున్నాడు. అతడికి నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీపన తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాలో నివాసం ఉంటుంది. వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలు ఏర్పడి రాకేశ్‌కు దీపన బ్రేకప్ చెప్పింది. అయినా రాకేశ్ ఆమె వెంట పడుతూ వేధించసాగాడు.