'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదంతో కార్మిక సంఘాలు మహాపాదయాత్ర Mahapadayatra Against Privatization of Steel Plant in Visakha:విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు మహా పాదయాత్ర చేపట్టాయి. కూర్మన్నపాలెం ఆర్చి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ మహాపాదయాత్ర కొనసాగింది. ఇందులో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, పెద్ద సంఖ్యలో మహాపాదయాత్రలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.
'ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు- బయోమెట్రిక్ హాజరు నిలిపేయాలి'
స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచించిన పార్టీకే మద్దతు:కూర్మన్నపాలెం నుంచి ఎన్ఏడీ కూడలి మీదుగా జీవీఎంసీ వరకు జరిగిన మహా పాదయాత్రలో కార్మికులకు మహిళలు, యువకులు పువ్వులు వేసి స్వాగతం పలికారు. పాదయాత్రలో వివిధ పార్టీ ప్రముఖులుతో పాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారి, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, గాజువాక వైసీపీ ఇంచార్జి ఉరకూటి చందు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అయోధ్య రామ్, ఆదినారాయణ, సీహెచ్ నరసింగరావు, రామచంద్ర, మస్తానప్పలు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కుకు తుప్పు పట్టిస్తున్న సీఎం జగన్
1116 రోజులు నుంచి ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశానికి ప్రాణవాయువు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రాణం తీస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి 2.8 టన్నులకు పడిపోయిందని అన్నారు. ఇంకా నిర్వాసితులకు న్యాయం చేయలేదని వచ్చే ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచించిన పార్టీ కోసమే విశాఖ స్టీల్ కార్మికులు ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు.
జిందాల్‌తో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు
స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్లక్ష్యం: ప్రత్యక్షంగా, పరోక్షంగా 75వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కో అడుగూ ముందుకెళ్తుంటే దాన్ని ఆపేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తిరిగి తెరచాటున విశాఖ ఉక్కు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఎక్కడ కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయంతోనే ఒక్క మాట కూడా అనడం లేదు. ప్రైవేటు స్టీల్ కర్మాగారాలకు అడిగిన వెంటనే ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపాన పోలేదు. ప్రస్తుతం ప్లాంటుకు సొంత గనుల్లేక ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది.