ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - 99.86 శాతం పోలింగ్ నమోదు Mahabubnagar MLC by Elections Polling Today 2024 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగియగా, భారీగా పోలింగ్ నమోదైంది. మొత్తం 1439 మంది ఓటర్లుండగా, అందులో 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 99.86 శాతం పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపుతో, ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది.
ఏడు దశల్లో 2024 లోక్సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,437 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ (BRS) నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి సుదర్శన్ గౌడ్ భవితవ్యాన్ని ప్రజాప్రతినిధులు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. ఆయా రాజకీయపక్షాలు తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధులను కర్ణాటక, మహారాష్ట్ర శిబిరాలకు తరలించారు. బస్సుల్లో నేరుగా వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం ద్వారా తమ పార్టీకే ఓటు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కొడంగల్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఓటు చాలా విలువైనది. ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి, తీర్థయాత్రకు వెళ్దాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్ని కార్యక్రమాలున్నా ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చాను. కార్యకర్తలను కలవాలని ఈసమావేశం ఏర్పాటుచేశాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు నా వెంట ఉన్నారు. నేను ప్రచారానికి రాకున్నా, నన్ను గెలిపించారు. ఎక్కడా ఉన్న నా కన్ను కొడంగల్ అభివృద్ధిపైన ఉంటుంది'. అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
'ఏప్రిల్లో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National level meeting
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!