Madanapalle Sub Collector Office Fire Accident Case : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం ఆయన ఘటనకు సంబంధించి నాలుగో రోజు విచారణ ముమ్మరంగా సాగుతోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోదియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తహశీల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైఎస్సార్సీపీ బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెళ్లగక్కారు. దీంతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి ఇటు రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు నాలుగో రోజు కూడా విచారణ వేగవంతంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసోదియా సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్టర్లు రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీవోలు తహశీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా? అనేదానిపై ఆరా తీశారు. గడచిన మూడేళ్ల కాలంలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూముల పైన సిసోదియా సంబంధిత రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ ఏ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏవిధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోసారి మంచిమనసు చాటుకున్న మంత్రి లోకేశ్ - ఓమన్‌లో చిక్కుకున్న మహిళకు భరోసా