M-AUTHN Software For Increased Cyber Security : స్మార్ట్‌ఫోన్ లేకుండా పూట కూడా గడపలేని స్థితికి వచ్చేసింది నేటితరం. పాఠశాల విద్యార్థులు మొదలుకుని ప్రతిఒక్కరూ ఏదోక యాప్‌లు వాడుతూనే ఉన్నారు. ఐతే ఇదే సైబర్ మోసగాళ్ల పాలిటవరంగా మారింది. హ్యాకర్లు ఏదోక మార్గంలో వినియోగదారులను ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు M-ఆథన్ అనే సాంకేతికతను రూపకల్పన చేశారు విట్ విద్యార్థులు.
నెటిజన్లను హడలెత్తిస్తున్న సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడేందుకు విజయవాడలోని విట్ అమరావతి విశ్వవిద్యాలయం విద్యార్థులు M-ఆథన్ పేరిట వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించారు. విట్ అధ్యాపకులు డాక్టర్ శిబి చక్రవర్తి ఆధ్వర్వంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు శరత్, ఆదిత్య మిత్ర, సాయి సంజయ్, ప్రియాన్ష్ తదితరులు కలిసి ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు.
విగ్రహాలకు ప్రాణం పోస్తూ - మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్న ఒంగోలు యువకుడు - Sculpture Artist in Prakasam Dist
ఏ యాప్‌కైనా పాస్‌వర్డ్, OTPలు తప్పనిసరి. కొందరు తరచూ పాస్‌వర్ట్‌లు మార్చి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. ఐనా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ వినియోగదారుల్ని మాయ చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులకు ఎమ్-ఆథన్ అడ్డుకట్ట వేస్తుంది అంటున్నారు విట్ బృందం.
M-ఆథన్ పాస్‌వర్డ్ అవసరం లేకుండా రూపొందించిన అధునాతన సాంకేతిక భద్రత వ్యవస్థ. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇతర ఏ యాప్‌లకైనా ఈ సాంకేతికత వర్తిస్తుంది. పాస్‌వర్డ్‌తో పనిలేకుండా బయోమెట్రిక్, ఫేస్, ఫింగర్ ప్రింట్స్‌తో పాటు ఫిజికల్ సెక్యూరిటీ అనే మూడు అంచెల రక్షణ వలయాన్ని ఇందులో సృష్టించారు.
M-ఆథన్ సాంకేతికతతో యాప్‌లను వినియోగిస్తే ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ చేయలేరని అంటున్నారు విట్ ప్రొఫెసర్ డాక్టర్ శిబి చక్రవర్తి. సైబర్ నేరగాళ్లకు భయపడకుండా స్వేచ్ఛగా డిజిటల్ సేవలను వాడుకోవచ్చని చెబుతున్నారు. రెండేళ్లు శ్రమించి IOT, మెటావర్స్, గూగుల్, బ్యాంకింగ్, ఇ-కామర్స్ ఇలా అన్ని డిజిటల్ సేవలకు అనుగుణంగా తీర్చిదిద్దామని అంటున్నారు.
13ఏళ్లలో 19వేలకుపైగా పాములు- వాటి కోసమే ఆ యువకుడి పోరాటం - Kranthi of Jangareddygudem
"మేం రెండేళ్లకు పైగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. 10 మంది కంటే ఎక్కువ సభ్యులు పరిశోధన, అభివృద్ధిపై అంకితభావంతో కృషి చేశారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌ను వేధిస్తున్న సమస్య పాస్‌వర్డ్‌లు. హ్యాకర్లు కొత్త కొత్త టెక్నిక్‌లతో పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. వీటని అధిగమించేందుకు బయోమెట్రిక్ పాస్‌వర్డ్‌గా ఉండే ఎం-ఆథన్‌ను తీసుకొచ్చాం. ఇది ఏ ఐవోటీ పరికరాలకైనా వర్తిస్తుంది. ఏ మెటావర్స్‌నైనా నిర్ధారించగలదు. పాస్‌వర్డ్ కలిగి ఉండే ఏ అప్లికేషన్‌లోనైనా దీన్ని పొందుపర్చుకోగలం. మాకు ఒక యాప్ ఉంది. మీరు ఏం తెల్సుకోదల్చుకున్నా అభ్యర్థించవచ్చు. మల్టీమోడ్ బయోమెట్రిక్ విధానంలో ఇది పనిచేస్తుంది. ఈ మధ్యే మా సొల్యూషన్ AELPని సాధించింది. ఇందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది." -డాక్టర్ శిబి చక్రవర్తి, అధ్యాపకులు, విట్ అమరావతి విశ్వవిద్యాలయం
"పాస్‌వర్డ్, OTP వ్యవస్థ ఉన్నప్పటికీ అవి వినియోగదారులకు అర్థమయ్యే లోపే చాల మంది మోసపోతున్నారు. హ్యాకర్లు ప్రయత్నించినా M-ఆథన్‌లోని మూడు అంచెల భద్రతను ఛేదించడం అసాధ్యం. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ సాంకేతికతను సులువుగా వాడుకునేలా M-ఆథన్‌ను అభివృద్ధి చేశాం." - శరత్, విట్ అమరావతి విశ్వవిద్యాలయం విద్యార్థి
సైబర్ సెక్యూరిటీకి భరోసా ఇస్తూ రూపొందించిన M-ఆథన్ ప్రాజెక్టు ఆలోచనకు మెచ్చి లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉత్సాహంతో మరిన్ని సాంకేతిక అంశాలు జోడించడంపై దృష్టి సారించింది విట్ బృందం.
ఇడ్లీ, దోశ, ఉప్మా - అక్కడ రూ.10కే టిఫిన్ - ఇంటి రుచికి ఏమాత్రం తీసిపోదు! - 10 RUPEES TIFFIN CENTRE STORY