Lorry Owners Association Permits Issue :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రాంతాల సరకు రవాణా వాహనాలు పైసా పన్ను లేకుండా సరకు తరలించేవి. రోజూ వేలాది సరకు రవాణా వాహనాలు మూడు ప్రాంతాల మధ్య తిరుగుతూ రవాణా చేసేవి. ఫలితంగా లారీ యజమానులకు, రైతులు, వ్యాపారులకూ లాభాల పంట పండేది.
Lorry Owners Permit Problems :రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉచిత రాకపోకలకు తెరపడుతుందని, ఇది తమకు తీవ్ర నష్టం కల్గిస్తుందని ఏపీ, తెలంగాణలోని లారీ యజమానులు సైతం అప్పట్లో ఆందోళనకు దిగారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని రెండు రాష్ట్రాలూ అమలు చేయాలని ఆదేశించింది. విభజన చట్టంలోనూ ఈ అంశాన్ని చేర్చింది. నామ మాత్రపు ఖర్చుతో సరకు రవాణా వాహనాలు తిప్పుకునే అవకాశం కల్పించాలని సూచించింది. దీనివల్ల తమకు కష్టాలు ఉండవని రెండు రాష్ట్రాల్లోని లారీ యజమానులు భావించారు.
'మీరే మమ్మల్ని గట్టెక్కించాలి'- మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం - LORRY OWNERS MEET MINISTER
రాష్ట్ర విభజన చేసి పదేళ్లయినా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ ప్రారంభానికి నోచుకోలేదు. తొలి ఐదేళ్లు చంద్రబాబు ప్రయత్నించినా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డగా తర్వాత ఐదేళ్లు తెలంగాణ సర్కారు సానుకూలత తెలిపినా ఏపీలోని జగన్ సర్కారు మోకాలడ్డింది. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని 2 రాష్ట్రాలూ అమలు చేయాలని పదేళ్లుగా వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నది లారీ యజమానుల ఆవేదన.