RTC Bus Accident in Annamaya District:అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ దగ్గర కడప- చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతివేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కొందరిని కడప రిమ్స్ కు, మరికొందరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండడంతోపాటు, అధిక లోడుతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.