Lord Shiva Devotees Lost Their Way in Forest:తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌కు చెందిన శివ స్వాములు కొందరు అడవిలో గూగుల్ మ్యాప్‌ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లి దారి తప్పారు. విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న రెస్క్యూ బృందం జీపీఎస్ ఆధారంగా వారుండే ప్రాంతానికి చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే
ఇదీ జరిగింది:కొల్లాపూర్‌కు చెందిన మనోజ్, గురుప్రసాద్, రాజు, గోపాల్‌తో సహా మొత్తం ఏడుగురు ఇంద్రేశ్వరం బీట్ మీదుగా శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్తూ అడవిలో పాకశాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక దారి తప్పిపోయారు. తాము దారి తప్పిన విషయాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వారు పోలీసులకు ఫోన్ చేశారు.