Lord Ganesh Immersion Celebrations in AP :ప్రకాశం జిల్లా మార్కాపురంలో గణనాథుడికి 9 రోజులపాటు విశేష పూజలు చేశారు. నిమజ్జనానికి తరలివెళ్లే ముందు లడ్డూ వేలం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన బస్టాండ్ సెంటర్‌లో కొలువుదీర్చిన వినాయకుని ఊరేగింపు ఘనంగా జరిగింది. దివిసీమలో గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోడూరు మండలం మాచవరంలో గణేష్ ఊరేగింపు యాత్రలో చిన్నారులు కర్రసాముతో అబ్బురపరిచారు. గణేష్ విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఘన నిమజ్జన కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి.
విగ్రహాలను ఊరేగింపుగా :విశాఖ గేటెడ్ కమ్యూనిటీ ఎంవీవీ సిటీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర కన్నులు పండుగగా జరిగింది. సముద్ర తీరానికి ఊరేగింపుగా స్వామిని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వినాయకుని నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమలాపురం పట్టణ వీధుల్లో వినాయకుడి ప్రతిమలను వైభవంగా ఊరేగించి పంట కాలవలో నిమజ్జనం చేశారు. రాజోలు, పి గన్నవరం, అయినవిల్లి, మలికిపురం, సఖినేటిపల్లి, అల్లవరం, మామిడికుదురు మండలాల్లో వినాయకుడి విగ్రహాలను ఊరేగించి గోదావరి నదీ పాయల్లో నిమజ్జనం చేశారు. యానాంతో పాటు పరిసర ప్రాంతాల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు.
గంగమ్మ ఒడికి 2 వేల గణనాథులు- కోలాహలంగా కేసీ కెనాల్ - Lord Ganesh Immersion Celebrations