Lokesh and Atchannaidu in Assembly: ఒకే పార్టీ, ప్రజల అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న అని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా అయ్యన్నపాత్రుడు భయపడలేదని నారా లోకేశ్ గుర్తుచేశారు. ఆయన నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని గుర్తుచేశారు.
తనకు ఎప్పుడు సలహా కావాలన్నా ఆయనతో సంప్రదించానన్నారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని ప్రశంసించిన లోకేశ్, ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా మీకు చాలా అనుభవం ఉందన్నారు. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించిన అయ్యన్న అనుభవనం రాష్ట్రానికి చాలా అవసరమని కొనియాడారు.
66 ఏళ్ల వయస్సులోనూ ఫైర్ బ్రాండే - ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న: చంద్రబాబు - Chandrababu Naidu Comments
Atchannaidu Comments in AP Assembly: ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదో శాసన సభాపతిగా ఎన్నికైనందుకు అయ్యన్నకు మంత్రి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చారన్న అచ్చెన్న, అతిచిన్న వయస్సులోనే శాసనసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు చేపట్టారని, పార్టీ ఏ ఆదేశాలిచ్చినా, అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకున్నారన్నారు. మీ రాజకీయ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. శాసనసభలో రాష్ట్ర ప్రయోజనాలపైనే చర్చలు జరిగేలా చూడాలని అచ్చెన్నాయుడు కోరారు.
చట్టసభలో చివరి సారి సభాధ్యక్ష పదవి- సభా గౌరవానికి భగం కలగనివ్వబోను: అయ్యన్న పాత్రుడు - Ayyanna Patrudu as Speaker