హైదరాబాద్ పరిధి ఎంపీ స్థానాల్లో పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి Lok Sabha Elections Arrangements in Hyderabad :లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024)ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్న వేళ అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతోంది. ఈ నెల 18 నుంచి 25 వరకు ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అన్నారు.
ఓటే మీ చేతిలో ఉన్న వజ్రాయుధం - తాయిలాలకు లొంగిపోవద్దంటూ మానవహక్కుల వేదిక అవగాహన - Voter Awareness Campaign
EC Focus on Polling in Hyderabad :హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారని రోనాల్డ్ రాస్ వెల్లడించారు. వారి కోసం 1675 ప్రాంతాల్లో 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ (GHMC Polling Arrangements 2024)ముందు రెండు రోజులు వరుస సెలవులు రావడం ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌లో 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని, ఈసారి 10 శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో 23,000ల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, అందులో 3700ల మంది గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు ఇచ్చామని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనున్నట్లు రోనాల్డ్ రాస్ వెల్లడించారు.
మొదటి దశ ఎన్నికల్లో 252మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు- సగానికి పైగా మందిపై తీవ్ర నేరారోపణలు : ADR - ADR Report on candidates cases
"బోగస్ ఓటర్లను గుర్తించి వారిని తీసివేశాం. నాలుగు నెల్లలో 25,000ల నుంచి 30,000ల వరకు మరణించిన వారి ఓట్లను తొలగించాం. అసెంబ్లీ ఎన్నికల ముందే దాదాపు 2.50 లక్షల నకిలీ ఓట్లను తొలగించాం. అనంతరం 20,000ల నకిలీ ఓట్లను తొలగించాం. కొందరు మాత్రం ఎన్నికలప్పుడు ఓటు వేయడానికి మాత్రమే వస్తారని ఆ ఇంట్లోని వారు చెబుతున్నారు. వాటిని తొలగించవద్దని అంటున్నారు. - రోనాల్డ్ రాస్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించి రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా మార్చారు. అక్కడే ఆ పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ శశాంక్ తెలిపారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 29,28,186 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి 2824 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్ సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 13,443 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని శశాంక్ వివరించారు.
Lok Sabha Elections 2024 : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 37,28,417 మంది ఓటర్లున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 3199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 19,448 మంది పోలింగ్ సిబ్బంది పనిచేయనున్నట్లు గౌతమ్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలు అలా ఉండాలి - లేదంటే ఈసీ చూస్తూ ఊరుకోదు : వికాస్‌రాజ్ - CEO Vikas Raj Interview
రాష్ట్రంలో శాంతియుతంగా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ - ఏర్పాట్లపై ఈసీకి వివరించిన సీఎస్ - Lok Sabha ELECTIONS 2024