Locals Clash with Panchayat Staff Over Pigs Relocation:వైయస్సార్ కడప జిల్లాలో పందులు పట్టుకునే విషయమై పంచాయతీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వాహనం ధ్వంసం కాగా స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. పందులు ఉన్న వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. అసలు అక్కడ ఏమైందంటే.
జిల్లాలోని జమ్మలమడుగులో గత కొద్ది రోజులుగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి పట్టణ శుభ్రతపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నగర పంచాయతీ సిబ్బంది పట్టణంలో క్లీనింగ్ పనులు చేపట్టారు. అయితే అక్కడే కొంత మంది స్థానికులు పందులు పెంచుకుంటున్నారు. ఆ పందులు పట్టణంలో సంచరించడంతో రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై కూడా ఫిర్యాదులు అందాయి.
దీంతో నగర కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆ పందుల యజమానులకు పందులను పట్టణంలోకి వదలకూడదని నోటీసులు ఇచ్చారు. అవసరం అయితే పందులు పెంచుకునేలా ఉరి చివరన అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పందుల యజమానులు పట్టించుకోలేదు. దీంతో నగర కమిషనర్ వారికి రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా వారు పట్టించుకోకుండా పందులను అలానే పట్టణంలోకి వదులుతున్నారు.