తెలంగాణ

telangana

ఏపీలో వెలుగుచూస్తున్న వాసుదేవరెడ్డి లిక్కర్ లీలలు - నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా! - FAKE HOLOGRAM STICKERS IN LIQUOR

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 5:37 PM IST

Liquor Supply with Fake Hologram Stickers : ఏపీ ఎక్సైజ్ శాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు, హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో తేటతెల్లమైంది.

Liquor Supply in AP
Liquor Supply with Fake Hologram Stickers (ETV Bharat)

Liquor Supply with Fake Hologram Stickers :ఏపీ ఎక్సైజ్ శాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్ మాల్ చేశారని ఆరోపించారు. మద్యం, బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్‌మాల్ జరిగిందని నకిలీ హోలోగ్రామ్‌ స్టిక్కర్లతో మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు అభియోగాలు ఉన్నాయి.

హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్‌ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. హోలోగ్రామ్‌ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు, హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో తేటతెల్లమైంది.

జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టబెట్టారని, గత వ్యాపార వివరాలు లేకుండా టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో స్పష్టమైంది. హోలోగ్రామ్ టెండర్ల కీలక సమాచారం గల్లంతవడంతో పాటు టెండర్ల ఖరారులో సాంకేతిక కమిటీ నివేదికపై అధీకృత సంతకాలు లేనట్లు గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా గల్లంతైనట్లు గుర్తించారు.

జగన్​ హయాంలో ఏపీకి ఆదాయం తగ్గి - అప్పులు పెరిగాయి : ఏపీ సీఎం చంద్రబాబు - White Paper on AP Financial Status

వీళ్లు సామాన్యులు కాదు - మనుషుల్లేకుండానే మద్యం అక్రమ రవాణా - Liquor smuggling In AP

ABOUT THE AUTHOR

...view details