Liquor Shops Allotment Process Completed in AP:రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తైంది. లాటరీ ద్వారా షాపులు కేటాయించారు. లాటరీలో మహిళలూ కొన్ని దుకాణాలు దక్కించుకున్నారు. లైసెన్స్ ఫీజులో ఆరో వంతు డబ్బును 48 గంటల్లోగా చెల్లించి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లాలో 123 మద్యం దుకాణాలకు మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో లాటరీ తీశారు. మహిళలకూ కొన్ని షాపులు దక్కాయి. 2 షాపులు ఇతర రాష్ట్రాల వారు చేజిక్కించుకున్నారు.
ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ - టెండర్ల కోసం పోటీపడ్డ మహిళలు (ETV Bharat) పోటీపడ్డ మహిళలు: ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో లాటరీ తీశారు. ఈ జిల్లాలో సగటున ఒక్కోషాపునకు 57 దరఖాస్తులు రావడంతో ఆశావహులతో కల్యాణమండపం కిటకిటలాడింది. గుంటూరు జిల్లాలో 127 దుకాణాల్ని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ లాటరీ ద్వారా కేటాయించగా మొదటి షాపు మల్లిశెట్టి సుబ్బారావు అనే వ్యాపారికి దక్కింది. బాపట్ల జిల్లాలో 117 షాపులకు 2149 దరఖాస్తులు వచ్చాయి. 2 కౌంటర్లు పెట్టి జిల్లా కలెక్టర్ వెంకట మురళి లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకొల్లు మండలంలోని 3 షాపులకు 47 దరఖాస్తులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 117 షాపులలో 6 షాపులను మహిళలు దక్కించుకున్నారు.
మద్యం దుకాణాలకు వేళాయె - లెక్క తేలింది కిక్కు ఎవరికో!
సిండికేట్ కోసం ప్రయత్నాలు: నెల్లూరు జిల్లాలో 182 దుకాణాలు లక్కీడిప్ ద్వారా కేటాయించారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో ప్రకాశం జిల్లాలోని 171 మద్యం షాపులకు లాటరీ నిర్వహించారు. అనంతపురంలో 136 దుకాణాలకు, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు లాటరీ తీశారు. మహిళలూ షాపుల కోసం పోటీపడ్డారు. లాటరీ పూర్తికాగానే లైసెన్స్ ఫీజులు చెల్లించేలా పక్కనే కౌంటర్లు పెట్టారు. వైఎస్సార్ జిల్లాలో 139 దుకాణాలు కేటాయించగా ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. వారితో సిండికేట్ కోసం స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాటరీ తీశారు.
అల్లూరి జిల్లాలో చింతపల్లికి చెందిన ఓ వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా 3 షాపులు లాటరీలో వచ్చాయి. పెదబయలులో వికలాంగుడికి దుకాణం దక్కింది. లాటరీలో ఓ గిరిజనేతరుడికి దక్కిన దుకాణాన్ని రద్దు చేసి ఆ తర్వాతి వ్యక్తికి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 158 షాపులకు అంబేడ్కర్ కళావేదికలో లాటరీ తీశారు. తూర్పు గోదావరి జిల్లాలో 125 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో లాటరీ తీశారు. ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైందని అధికారులు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133 మద్యం దుకాణాలకు 4087 మద్యం దరఖాస్తులు వచ్చాయి. వీటికి లాటరీ తీసి దుకాణాలను ఎంపిక చేశారు.
మద్యం దుకాణాల దరఖాస్తుల ఆదాయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
క్వార్టర్ బాటిల్ 99కే - చిల్లర లెక్కలకు చెల్లు - ఫారిన్ కిక్కు