Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari :తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో పాగా వేసిన చిరుత జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత మంగళవారం ఓ రైతుకు తారసపడిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్, సీసీ కెమెరాలకు చిక్కలేదు. అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావడంతో అది ఎటువైపు వెళ్లిందన్న అంశంపై తీవ్ర భయాందోళన నెలకొంది.
ముమ్మరంగా గాలిస్తున్న అటవీశాఖ :తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కోసం అటవీ సిబ్బంది అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతోంది. గత 22 రోజులుగా జనాల్ని హడలెత్తిస్తూ అటవీ శాఖను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుతపులి తప్పించుకొని తిరుగుతోంది. పాదముద్రలు సేకరించి చిరుత సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్థారించారు. 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం నర్సరీల్లో జల్లెడ పట్టారు. అయినీ ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు. భారీ వర్షం కురవడంతో పాదముద్రల సేకరణకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో కడియపు లంక, బుర్రిలంకలో తీవ్ర అలజడి నెలకొంది. జనం నర్సరీల్లో పనులు మానుకొని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
రూటు మార్చిన చిరుత - అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి సంచారం - Leopard at Diwancheruvu Forest