Election Campaigns Across AP: సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వేళ, అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కరపత్రాలు పంచుతూ ఎన్నికల్లో గెలిచాక చేయబోయే కార్యక్రమాలను, కూటమి అభ్యర్థులు ప్రజలకు వివరించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఉరవకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పయ్యావల కేశవ్ బెలుగుప్ప మండలంలో రోడ్‌షో నిర్వహించి, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో కూటమి అభ్యర్థి ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేజర్ల మండలంలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలంలో ప్రచారం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నకరికల్లు మండలం చాళగుల్లులో ప్రచారం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారం నిర్వహించి... తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నంబొట్లవారి పాలెంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిన తీరును ప్రజలకు వివరించారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పామర్రు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా, పమిడి ముక్కల మండలంలో ప్రచారం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి జగన్ తీవ్ర అన్యాయం చేశారని కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. నందిగామ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. విజయవాడ 45 వ డివిజన్ లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి, పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారం చేశారు.