ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజల్ట్​ రాకముందే వైఎస్సార్సీపీ నేతల అలర్ట్​- దొరికినంత దండుకునే ప్లాన్స్​ - YSRCP Leaders Land Encroachments - YSRCP LEADERS LAND ENCROACHMENTS

Land Encroachments of YSRCP Leaders : ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడడానికి వారంరోజులు మాత్రమే ఉంది. అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ నేతలు మాత్రం దొరికినంత దండుకో అన్న సూత్రాన్నేఅవలంబిస్తున్నారు.

land_encroachments_of_-ysrcp_leaders
land_encroachments_of_-ysrcp_leaders (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 1:47 PM IST

రిజల్ట్​ రాకముందే వైఎస్సార్సీపీ నేతల అలర్ట్​- దొరికినంత దండుకునే ప్లాన్స్​ (ETV Bharat)

Land Encroachments of YSRCP Leaders :ఉత్తరాంధ్రలో విలువైన భూములపై కన్నేసిన వైఎస్సార్సీపీ పెద్దలు ఎన్నికల హడావుడిలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్లీ పావులు కదుపుతున్నారు. దాదాపు వందకోట్ల విలువైన మాన్సాస్ భూమి కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూమిని తొలగించాలంటూ రెండేళ్ల క్రితమే అర్జీ పెట్టగా అప్పటి దేవాదాయ కమిషనర్ తిరస్కరించారు. ఫిబ్రవరిలో మరోసారి అప్పీలు చేయగా NOC ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే: మూర్తియాదవ్‌ - Murthy Yadav Allegations on CS

Mansas Trust Land Grabbing Issue : విజయనగరం రాజులు గుళ్లు, విద్యాలయాలకు దానం ఇచ్చిన వందల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విజయనగరంలోని దాదాపు 100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి దాన్ని అధికారపార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ భూమి దేవాదాయశాఖ పరిధిలోదని గతంలో స్పష్టంగా చెప్పినా మళ్లీ తెరవెనుక పావులు కదుపుతున్నారు. దేవదాయ మంత్రితోపాటు ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి ఈ వ్యవహారం వెనక ఉన్నారని తెలుస్తోంది.

మాన్సాస్‌ ట్రస్టుకు విజయనగరం పరిధిలోని ధర్మపురిలో 212 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలోనివి. ఇందులో 8.96 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజయనగరానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ సంస్థ వసంత్‌ విహార్‌ యజమాని జయప్రకాశ్‌బాబు 2021లో దేవదాయశాఖకు అర్జీ పెట్టుకున్నారు. అక్కడ ఎకరం 10 కోట్లపైనే పలుకుతోంది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన దేవదాయశాఖ అధికారులు ఈ భూమి మాన్సాస్‌ ట్రస్టుకు చెందినదని నిషేధిత జాబితా నుంచి తొలగించి NOC (No Objection Certificate) ఇవ్వడం కుదరని తేల్చి చెప్పారు. దేవదాయ ట్రైబ్యునల్‌కు మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు.

'గజపతి'లో 'అప్ప'నంగా భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు - ఐదేళ్లలో వందల ఎకరాలు పోగు - YSRCP Leaders Irregularities

ఈ భూమిని చేజిక్కుంచుకోవాలని భావించిన సదరు స్థిరాస్తి సంస్థ దేవదాయశాఖ మంత్రి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పీలు దాఖలుచేశారు. నిజానికి మంత్రి ఆ అప్పీలును తిరస్కరించాలి. కానీ ఆయన అప్పీలును పరిగణనలోకి తీసుకొని, తగిన నిర్ణయం తీసుకోవాలని మళ్లీ అధికారులను ఆదేశించారు. దీంతో దస్త్రం వేగంగా కదులుతోంది. ఎన్​ఓసీ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉన్నా ఈ దస్త్రం మాత్రం పరుగులు పెడుతోంది. దేవదాయశాఖలోని ఓ కీలక అధికారి సైతం దీనిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిసింది.

కబ్జాలు, సెటిల్‌మెంట్లు - సిరులతో కళకళలాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కుటుంబం - YSRCP Leader Irregularities

ABOUT THE AUTHOR

...view details