Laknavaram Lake Tourism :ఆదివారం వస్తే చాలు చాలా మంది వీకెండ్‌కు ఫ్లాన్ చేస్తుంటారు. వారంలో కనీసం ఆ ఒక్కరోజైన ప్రశాంతమైన వాతావరణంలో మనసును హాయిగా ఉంచుకోవాలని చూస్తారు. హైదరాబాద్ నగరంలోనే ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉన్నా ట్రాఫిక్ రణగొణుల మధ్య వెళ్లాలనే మూడ్ కాస్తా మారిపోతోంది. అందుకే చాలా మంది నగరానికి దూరంగా వెళ్లి వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు.
ముఖ్యంగా చుట్టూ చెట్లు, రిజర్వాయర్లు లాంటి ప్రదేశాలకే ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే తెలంగాణలోనూ అలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటి కంటే భిన్నమైన పర్యాటక ప్రాంతం సైతం ఉంది. చుట్టూ నీళ్లు మధ్యలో బస చేయవచ్చు. ఈ అనుభూతిని ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. హైదరాబాద్‌కు దగ్గరలోనే ఆ ప్రాంతం ఉంది. ఆ పర్యాటక భూతల స్వర్గధామమే ముులుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం జలాశయం.
సహజ అందాలకు నెలవు లక్నవరం : లక్నవరం జలాశయం పేరు వినగానే ప్రతిసారి ఈ పేరు ఎక్కడో వింటున్నట్లు అనివిస్తుంది కదూ! ఆ జలాశయంలోనే మూడో ద్వీపం(ఐలాండ్)ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే లక్నవరం జలాశయం సహజసిద్ధమైన అందాలకు నెలవు. అలాంటి రమణీయమైన ప్రదేశానికి ఇలాంటి ద్వీపం తోడైతే పర్యాటకులకు ఇక స్వర్గమే. ఈ ద్వీపాన్ని 8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఈ ద్వీపాన్ని టీఎస్‌టీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేస్తోంది.
మూడో ద్వీపం విశేషాలు :
- లక్నవరం ఐలాండ్‌లో పర్యాటకుల ఆహ్వాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యాననవనాలు ఉన్నాయి
- మొత్తం 22 కాటేజీలు ఉన్నాయి.
- ఈ 22 కాటేజీల్లో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వచ్చే వారికి ఇవ్వనున్నారు.
- ఈ ద్వీపంలో ఐదు ఈత కొలనులు ఉండగా వాటిలో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు.
- పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
- పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర వసతులు.
- మాల్దీవుులు, శిమ్లా, ముున్నార్ తదితర ప్రాంతాలను తలపించే విధంగా ఈ ద్వీపాన్ని సుందరీకరించారు.
- ఫ్రీ కోట్స్‌కు చెందిన 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు.