తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో అఘోరీ హల్​చల్ ​- పెట్రోల్​తో​ వృద్దుడిపై దాడికి యత్నం - LADY AGHORI HALCHAL IN WARANGAL

వరంగల్​లో లేడీ అఘోరీ హల్​చల్​ - చూసేందుకు గుంపులుగా వచ్చిన స్థానికులు - అసహనంతో స్థానికులపై దాడికి దిగిన అఘోరీ

Lady Aghori Halchal in Warangal
Lady Aghori Halchal in Warangal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 1:54 PM IST

Updated : Jan 31, 2025, 2:20 PM IST

Lady Aghori Halchal in Warangal :వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్షీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందు సోషల్​ మీడియా వైరల్​ మహిళా అఘోరీ ఆలయానికి వచ్చింది. దీంతో ఆమెను చూడడానికి స్థానికులు అక్కడికి గుంపులుగా చేరుకున్నారు. ఓ సందర్భంలో వారందరినీ చూసి అఘోరి వారిపై అసహనం వ్యక్తం చేశారు. అందులో ఓ వృద్ధుడు ఆమెతో కాసేపు వాధించారు. అఘోరీ అంటూ అందరినీ మోసం చేస్తున్నావంటూ స్థానికులు అరిచారు.

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభ మేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. సాధువులు, నాగ సాధువులు అందరూ అక్కడికి వెళ్తుంటే, నువ్వు వెళ్లలేదా? అని నిలదీశారు. దీంతో కోపానికి గురైన అఘోరీ కారు అద్దాలు పగులకొట్టడానికి వెళ్లింది.

మనం అందరం బాధలో ఉన్నాం :దాన్ని ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిని కొట్టడానికి వెళ్లింది. స్థానికులు ఒక్కసారిగా కేకలు వేశారు. అందరూ ఆమెను నకిలీ అఘోరివని గట్టిగా అరిచారు. దీంతో పెట్రోల్​ క్యాన్​ తీసుకుని హల్​చల్​ చేసింది. తానూ మనిషినేనని, తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది. ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించగా, ఫోన్​ లాక్కొని కింద పడేసింది. గుడికి వచ్చిన తనతో సెల్ఫీ ఏంటని అతన్ని కొట్టింది. తర్వాత ఆమె దగ్గరికి వచ్చిన కొందరితో మాట్లాడి, 'మనం అందరం బాధలో ఉన్నాం, భగవంతుడు చల్లగా చూడాలి' అంటూ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మహాకుంభ్​లో 27ఏళ్ల తర్వాత కనిపించిన వ్యక్తి- భర్తను అలా గుర్తించిన భార్య- కానీ చిక్కంతా అక్కడే!

నడిరోడ్డుపై అఘోరి హల్‌చల్‌ - కనిపించిన వారిపై త్రిశూలంతో దాడి

Last Updated : Jan 31, 2025, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details