KVP Ramachandra Rao on CM Jagan:ప్రధాని దర్శనం దొరికినందుకు జగన్‌కు అభినందనలు అని వైఎస్ సన్నిహితులు, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సార్లు దిల్లీకి వెళ్లిన సీఎం జగనే అని ఆయన అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణంలో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారని, ఈ కేసుల్లో అరెస్టు నుంచి ఏపీ నేతలకు మాత్రం మినహాయింపు ఇచ్చారని కేవీపీ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియడం లేదని కేవీపీ అన్నారు. అధికార పార్టీ పొలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KVP Ramachandra Rao: 'రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే వైఎస్ ఆత్మ శాంతిస్తుంది'
భారతీయ జనతా పార్టీ దృష్టిలో మరకలేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే ఉందని అనుకుంటునట్లుగా ఉందని కేవీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని మంత్రులు, ఎంపీలపై కేసులు ఎందుకు లేవో బీజేపీ చెప్పాలని ప్రశ్నించారు. దేశమంతా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని, అలాంటిది ఏపీలో నగదుతో విక్రయాలు జరిగినా కేంద్రం పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు.