Krishna River Management Board Meeting in Delhi: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, సంబంధిత కాంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఖరారు కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీలో ఈ నెల 17వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ(Central Water Resources Department) కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరగనుంది.
సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీకి కేఆర్ఎంబీ గ్రీన్‌సిగ్నల్
KRMB Meeting on Projects Protocols AP and TS: రెండు ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన 15 ప్రాధాన్యతా ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేసేందుకు అవసరమైన ప్రోటోకాల్స్‌ను బోర్డు, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు ఖరారు చేయాలని దిల్లీ సమావేశం మినిట్స్‌లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కృష్ణా బోర్డు ఛైర్మన్ గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఔట్ లెట్లను స్వాధీనం చేసేందుకు వీలుగా అవసరమైన ప్రోటోకాల్స్‌పై చర్చించి ఖరారు చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించే విషయమై సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు కృష్ణా బోర్డు(KRMB) సమాచారం ఇచ్చింది.
కృష్ణా యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ - ఏపీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు