తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం - Korutla Road Accident Today

Korutla Road Accident Today : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Korutla Road Accident
Korutla Road Accident

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 8:29 AM IST

Updated : Mar 17, 2024, 9:43 AM IST

Korutla Road Accident Today : రోజువారీ జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా, ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా, కొన్ని సార్లు ఇతరులు చేసిన తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కారు టైరు మార్చుతుండగా ఢీకొట్టిన మరో వాహనం- ఆరుగురు మృతి- దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

Venkatapur Road Accident Today : తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పొయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు కొండగట్టు నుంచి మెట్‌పల్లికి వెళ్తున్న కూలీలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వారు పేర్కొన్నారు.

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి

Last Updated : Mar 17, 2024, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details