తెలంగాణ

telangana

ETV Bharat / state

పండ్ల వ్యాపారులకు గుడ్‌ న్యూస్- ఎన్నికల తర్వాత కోహెడ మార్కెట్​కు శ్రీకారం! - Koheda Fruit Market

Koheda Fruit Market in Hyderabad : అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ శివారులో పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్లలతో ఈ మార్కెట్‌ నిర్మాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Bata Singaram Fruit Market
Koheda Fruit Market Details

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 9:25 AM IST

అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో కోహెడ పండ్ల మార్కెట్‌

Koheda Fruit Market in Hyderabad: ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కు అన్నట్లుగా సాగిన హైదరాబాద్‌ శివారులోని కోహెడ పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి ప్రస్తుతం వేగంగా అడుగులు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ వద్ద బాహ్య వలయ రహదారి పక్కన అతి పెద్ద పండ్ల మార్కెట్‌ కొలువు తీరబోతోంది. 2 వందల ఎకరాల విస్తీర్ణంలో రూ.4 వందల కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ మార్కెట్‌ నిర్మించనుంది. గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా కోహెడకు తరలించింది.

Koheda Fruit Market Works Latest News :అకాల వర్షాలు గాలి దుమారంతో అప్పట్లో గడ్డిఅన్నారం మార్కెట్‌ ప్రాంగణంలోని రేకుల షెడ్లన్నీ కూలిపోయాయి. అప్పటికప్పుడు పండ్ల క్రయ, విక్రయాలపై ప్రభావం పడకుండా బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్ పార్కులోకి మార్చారు. అప్పట్నుంచి మార్కెట్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్న తరుణంలో కోహెడలో శాశ్వతంగా నిర్మించాల్సిన మార్కెట్ పనులకు ఆలస్యమైంది.

అనుమానాలన్నీ పటాపంచలు.. బాటసింగారంలో జోరందుకున్న మామిడి క్రయవిక్రయాలు

తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం, తాజాగా లోక్‌సభ ఎన్నికల వల్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఆధునిక హంగులతో కూడిన అంతర్జాతీయ మార్కెడ్ యార్డు(International Market Yard) కోసం రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ కదలికలతో వీలైనంత త్వరగా కోహెడలో మార్కెట్ నిర్మాణం చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.

Biggest Fruit Market at Koheda in Hyderabad: గ్లోబల్ గ్రీన్ మార్కెట్(Global Green Market) పేరిట 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. విశాలమైన నిల్వ సామర్థ్యం గల గోదాములు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, సౌర విద్యుత్ కేంద్రం, శీతల గిడ్డంగులు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం తదితరాలను సమకూర్చనుంది. అంతర్జాతీయ, జాతీయ పండ్లు, కూరగాయల మార్కెట్‌ విస్తరణ ప్రణాళికలు దృష్ట్యా అదనంగా మరో 100 ఎకరాల భూమి అదనంగా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో జోరుగా మామిడి సీజన్ - క్రయ, విక్రయాలతో కళకళలాడుతోన్న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ - MANGO SALES IN HYDERABAD

"200 ఎకరాల్లోని అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని లక్ష్యం. దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు అనుగుణంగా తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే దీనిపై సదురు మంత్రితో చర్చలు జరిపించాం. ఈ మార్కెట్‌ పనులు లోక్‌సభ ఎన్నికలు అనంతరం కార్యరూపం చేస్తాం. పండ్లును ఎగుమతి చేసేందుకు ప్రస్తుతం సరైన వసతులు లేవని గుర్తించాం."-నర్సింహారెడ్డి, గ్రేడ్‌-1 కార్యదర్శి మార్కెటింగ్‌ శాఖ

Koheda Fruit Market Details : కోహెడలో 41.57 ఎకరాల్లో షెడ్లు, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో శీతల గిడ్డంగులు, 45 ఎకరాల్లో రహదారులు, 24.44 ఎకరాల్లో పార్కింగ్ వంటివి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా డీపీఆర్‌ తుది రూపు సిద్ధం చేశారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి, శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో పాటు రీజినల్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో ఈ కోహెడ మార్కెట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఏడాది బాటసింగారంలోనే మామిడి సీజన్: నరసింహారెడ్డ

కొహెడలో గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్​ నిర్మాణాలకు శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details