విద్యుత్ నిలిపేసి- మరుదొడ్లకు తాళం వేసి- కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల దీక్షను భగ్నం చేశారు Kodi Katti Case Srinu Mother Protest: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యం చెప్పి, న్యాయం చేయాలంటూ కోడి కత్తి శీను తల్లి సావిత్రమ్మ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చేపట్టారు. గత మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌లోని రామా ఫంక్షన్‌హాలులో ఆమె నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఆయితే ఈ దీక్షను శనివారం రాత్రి పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు.
గత మూడు రోజులుగా దీక్ష చేపట్టండంతో సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో శిబిరం వద్దకు చేరుకుని, దీక్ష విరమించాలని ఆమెను కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చేబితేనే తాను దీక్ష విరమిస్తానని సావిత్రమ్మ పోలీసులకు తేల్చిచెప్పారు. దీంతో రాత్రి 10గంటల సమయంలో దీక్షా శిబిరం నుంచి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
కోడికత్తి కేసులో ఎందుకీ జగన్నాటకం?
దీక్ష చేస్తున్న వారిని దీక్షా శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో దీక్షకు సంఘీభావం ప్రకటించిన సమతా సైనిక్ దళ్ మద్దతుదారుల సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య దాదాపు గంటపాటు తోపులాట చోటు చేసుకుంది. సైనిక్ దళ్ సభ్యులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఓ కార్యకర్త పెట్రోల్ సీసా తీసుకుని ఆత్మాహత్యయత్నం చేశాడు. పోలీసులు అతడ్ని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
నిరసనకారులు అడ్డుకున్న సావిత్రమ్మను పోలీసులు అత్యవసర వాహనంలో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా, ఫంక్షన్ హాలులో అంతకుముందు దీక్ష చేస్తున్నవారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఫంక్షన్‌హాలు మరుగుదొడ్లకు తాళాలు వేయించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గాలి లేక దోమలు కుడుతున్నా సరే, 74 ఏళ్ల వయసున్న సావిత్రమ్మ దీక్షను అలాగే కొనసాగించారు. గత మూడు రోజుల నుంచి దీక్షను కొనసాగిస్తుండటంతో సావిత్రమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శనివారం రాత్రి ఆమె సొమ్మసిల్లి పడిపోవడం అధికారులను కలవరపెట్టింది.
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం
తెలుగుదేశం నేతల మద్దతు: శీను తల్లి సావిత్రమ్మ చేపట్టిన దీక్షకు తెలుగుదేశం, జనసేన నాయకులతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. జగన్ ఆడిన కోడికత్తి డ్రామాలో శ్రీనివాసు బలయ్యాడని వివిధ పార్టీల నేతలు విమర్శించారు. టీడీపీ నేతలు బొండా ఉమామాహేశ్వరరావు, వర్ల రామయ్య, పిల్లి మాణిక్యరావు, రావి సౌమ్య, తంగిరాల సౌమ్య దీక్షకు మద్దతు ప్రకటించారు.
ఎన్నికల్లో సానుభూతి కోసం వైఎస్సార్సీపీ నాయకులు, సీఎం జగన్ కోడికత్తి నాటకమాడారని మండిపడ్డారు. అమాయకుడైన శ్రీనివాస్‌ని ఐదేళ్లు జైలులో ఉంచారని విమర్శించారు. ప్రస్తుతం కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పై బయటకు వస్తే ముఖ్యమంత్రి జగన్ బండారం బయటపడుతుందనే భయంతోనే బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్న శీను బయటకు రాకపోవడం దారుణామని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ్యాప్యంలో కుమారుడికి న్యాయం కావాలని సావిత్రమ్మ దీక్ష చేపట్టడం బాధకరమని అన్నారు.
జైళ్లలో మగ్గుతున్న వారి కోసం కమిషన్‌తో విచారణ జరిపించాలి: వర్ల రామయ్య