Kodela Sivaram Support to Kanna Lakshminarayana in Sattenapalle : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం మధ్య నెలకొన్న విభేదాలు సర్దుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం ఇద్దరూ కలిసి పని చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం పోటిపడ్డారు. కానీ చివరికి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు ఖరారు చేశారు. అప్పటి నుంచి కోడెల శివరాం అసంతృప్తితో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని అడ్రస్ లేకుండా ఓడిస్తాం: కన్నా లక్ష్మీనారాయణ
నియోజకవర్గంలో సొంతగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అంశం పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో ఇటీవల లోకేశ్ కోడెల శివరాంను పిలిచి మాట్లాడారు. ప్రస్తుతం పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, రామరాజును పార్టీ తరపున గుంటూరు పంపించారు. వారిద్దరి సమక్షంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నివాసంలో కన్నా, కోడెల భేటీ జరిగింది. తరువాత ఇద్దరు నేతలు కలిసి భోజనం చేశారు.
Kanna and Kodela Meeting : అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం కలిసి పని చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. గతంలో కోడెల శివప్రసాద్ ప్రాతినిథ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. కానీ కోడెల శివరాం మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ వివిధ కారణాలలో చివరికి కన్నా లక్ష్మీనారాయణకే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.