Kidney Disease Patients Problems in NTR district :ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టు నిర్మాణానికి 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఏడాదిన్నర కిందట ప్రకటించారు. కానీ ఒక్క రూపాయైనా విడుదల కాలేదు. ప్రాజెక్టు పూర్తయ్యేదాకా తాత్కాలికంగా ట్యాంకర్లతో అన్ని తండాలకూ నీటిని అందించేందుకు 6కోట్లు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ఏడాది క్రితం ప్రకటించారు. ఇక్కడా పైసా విడుదల కాలేదు. ప్రైవేటు గుత్తేదారుల ద్వారా కుదప వద్ద ఉన్న కృష్ణా జలాల సంపు నుంచి ట్రాక్టర్ల ద్వారా 2023 సెప్టెంబరు నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయించారు. కానీ బిల్లులు ఇవ్వలేదు. ట్యాంకర్ల యజమానులు నీటి సరఫరా ఆపేశారు. ఫిబ్రవరి నెలలోనూ ఇలాగే పది రోజులు సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటిన్నర రూపాయల వరకూ ట్యాంకర్లకు బకాయిపడినట్లు తెలుస్తోంది.
కిడ్నీ వ్యాధిగ్రస్తుల పేరు చెప్పి జగన్ మోసం చేస్తున్నారు: టీడీపీ నేత కూన రవికుమార్
'మాటిచ్చి నిలబెట్టుకోలేని జగన్ సర్కార్ అసమర్థత కిడ్నీ బాధితుల ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రస్తుతం తండాల్లో ఇంటికి ఒకరిద్దరు కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారు. ఎ.కొండూరు దీప్లానగర్ తండాకు చెందిన వార్డు మెంబర్ భరోతు జమకా కిడ్నీ వ్యాధి బారినపడి మృతి చెందింది. మరో రెండు నెలలకే వడిత్య కృష్ణ, బానోతు రామోజీ, భుక్యా బీమా, భరోతు చంద్రు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎ.కొండూరు మండల పరిధిలోని తండాల్లో ఐదేళ్లలో 250 మందికి పైగా మృతిచెందారు. ఐనా మంచినీరు సరఫరా చేయించలేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తోంది.'-బీక్లా నాయక్, గిరిజన సంఘ ప్రతినిధి గోపిరాజు, రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి
హాస్పిటల్ పూర్తయ్యి.. ఉద్దానం కిడ్నీ బాధితుల తలరాత మారేది ఎప్పుడో..?