Wedding Season Started :కల్యాణ ఘడియలు రావడంతో లోగిళ్లలో హడావుడి, దుకాణాల్లో సందడి కనపడుతోంది. దాదాపు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరారవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మొదలైంది. రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన కన్వెక్షన్లు, గార్డెన్స్, కల్యాణ మందిరాలు కలకల లాడునున్నాయి.
కార్తీక మాసం మొదలుకావడంతో ( నవంబర్ 1 నుంచి) రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కో వివాహానికి 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయనున్నారు. వచ్చే నెలలో (నవంబర్) 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబరులో 4, 5, 9, 10, 11, 14, 15, 16వ తేదీలు శుభప్రదమైన రోజులుగా పండితులు చెబుతున్నారు.
వరుడు మైనర్-వధువు మేజర్ - ప్రేమపెళ్లిలో ట్విస్ట్
వివిధ వృత్తుల వారికి ఉపాధి :పురోహితులు, మంగళ వాయిద్యాలు, రజకులు, బంగారం, వెండి ఆభరణాల తయారీ, వస్త్ర దుకాణాలు, నిత్యావసరాలు, విస్తరాకులు తయారు చేసే స్వయం ఉపాధి సంఘాలు, తాంబూలాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, దండలు, అద్దె కార్లు, కళాకారులు, ఐస్ క్రీం, విద్యుత్తు, వేదిక అలంకరణ, మైక్ సెట్లు, విందు భోజనం తయారు, షామియానా తదితర వృత్తిదారులకు ఉపాధి లభిస్తుందని ఆర్థిక చెబుతున్నారు.