ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విచారణ వేగవంతం - రేషన్ బియ్యం అక్రమార్కులకు ముచ్చెమటలు - KAKINADA PORT RATION RICE ISSUE

రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ - అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామన్న తూర్పు నావికదళ ప్రధానాధికారి

kakinada_port_ration_rice
kakinada port ration rice (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 5:38 PM IST

Kakinada Port Ration Rice Illegal Export Issue: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి అంశంపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేస్తామని కలెక్టర్ షాన్‌మోహన్‌ వెల్లడించారు. రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్‌, పౌరసరఫరాలు, పోర్టు అథారిటీతో కలిసి ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గోదాము నుంచి షిప్‌ వరకు రేషన్ బియ్యం ఎలా వచ్చాయో నిగ్గు తేలుస్తామన్నారు.

అక్రమ రవాణాను అరికట్టేందుకు కలిసి పనిచేస్తాం: అదే విధంగా సముద్ర యానం ద్వారా నౌకల భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసాగా నిలుస్తామని తూర్పు నావికదళ ప్రధానాధికారి రాజేష్ పెంథార్కర్ తెలిపారు. నౌకల ద్వారా జరిగే ఎటువంటి అక్రమ రవాణానైనా అరికట్టేందుకు ఇతర ఏజెన్సీలతో కలిసి తమ వంతుగా పనిచేస్తామని వెల్లడించారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాను నిరోధించే విషయంలో నావికాదళ పాత్ర ఏమిటన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ తరహా వాటిని అరికట్టేందుకు తమను ఇతర ఏజెన్సీలు కోరితే పూర్తిగా సహకరిస్తామన్నారు

వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్‌' దందాలు

చెక్‌పోస్టు పెట్టుకుంటానంటే కుర్చీ, టెంట్ ఏర్పాటు చేస్తా:మరోవైపు తనపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు. తనతో వియ్యం పొందాక తన వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేయట్లేదని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మూడు తరాలుగా తన వియ్యంకుడు బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు.

పేర్ని నాని, అంబటి రాంబాబులకు అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్​ను తనిఖీ చేసుకోవచ్చునని సవాల్ విసిరారు. చెక్ పోస్టు పెట్టుకుంటానంటే నేనే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తానని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యంతో తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారని వివరించారు.

వైఎస్సార్సీపీ పెద్దలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తుండటం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌ స్మగ్లింగ్‌పై దర్యాప్తు చేయాలని కోరారు. విచారణలో జాప్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి కొన్నేళ్లుగా అక్రమ రవాణా జరుగుతోందని, వెంటనే చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం చెప్తోందన్న యనమల రామకృష్ణుడు, ప్రభుత్వం నుంచి ప్రజలు అదే ఆశిస్తున్నారని తెలిపారు.

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details