తెలంగాణ

telangana

ETV Bharat / state

కేయూ హాస్టల్‌లో ఊడిపడిన పైకప్పు పెచ్చులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు - Slab Collapsed In KU Womens Hostel - SLAB COLLAPSED IN KU WOMENS HOSTEL

Slab Collapsed In KU Womens Hostel : కాకతీయ యూనివర్సిటీలోని పోతన మహిళా హాస్టల్‌లో రాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఊపిపడిన స్లాబ్‌ భాగాన్ని చూసి విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేయూ రిజిస్ట్రార్‌తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు.

Slab Collapsed In Kakatiya University Womens Hostel
Slab Collapsed In Kakatiya University Womens Hostel (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 10:55 AM IST

Slab Collapsed In Kakatiya University Womens Hostel : కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్​లో రాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడటంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టం కొద్దీ ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

కాకతీయ యూనివర్సిటీలోని పోతన మహిళా హాస్టల్‌లో శుక్రవారం రాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. ఒక్కసారిగా ఊడిపడిన స్లాబ్‌ భాగాన్ని చూసి విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. 15 రోజుల క్రితం హాస్టల్ గదిలో ఉన్న ఓ అమ్మాయిపై ఫ్యాన్ ఊడిపడి తలకు బలమైన గాయమైంది. ఆ ఘటన మరువక ముందే మరోసారి స్లాబ్‌ పెచ్చులూడటంపై అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాన్ని మార్చాలని ఎన్నిసార్లు విశ్వవిద్యాలయం అధికారులకు మొరపెట్టుకున్నా, పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీపై విజిలెన్స్​ విచారణకు ప్రభుత్వం ఆదేశం - Vigilance Inquiry On KU VC

వర్షాకాలంలో తమ వెతలు పట్టించుకునే వారే కరవయ్యారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్​లో సరైన వసతులు లేవని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేయూలోని రాణి రుద్రమదేవి హాస్టల్‌ను రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌కు వచ్చిన రిజిస్ట్రార్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్‌ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరిపైన భవనం పెచ్చులు ఊడిపడతాయా తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'రాత్రి పడుకునే ముందు పెచ్చులు ఊడిపడ్డాయి. సమస్యలపై రిజిస్ట్రార్​కు ఇప్పటికే ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు చేపట్టడం లేదు. హాస్టల్​లో పాములు, కుక్కలు, ఎలుకల సమస్య ఎక్కువగా ఉంది. భవనం పాతబడిపోయింది. అయినా అధికారుల్లో చలనం లేదు. 15 రోజుల క్రితం అమ్మాయిపై ఫ్యాన్ పడిన ఘటనలో చర్యలు చేపడతామని చెప్పి, ఇప్పటి వరకూ స్పందించలేదు.' -కేయూ విద్యార్థులు

విద్యార్థిపై పడిన ఫ్యాన్ : 15 రోజుల క్రితం సీలింగ్‌ ఫ్యాను ఊడి మీద పడటంతో లునావత్‌ సంధ్య అనే విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్‌ సూపర్‌వైజర్‌ శోభ సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. పాత భవనంలో ఎప్పుడో బిగించిన ఫ్యాన్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరమ్మతులు చేస్తామని చెప్పిన అధికారులు స్పందించలేదు. తాజాగా మరోసారి భవనం పెచ్చులు ఊడిపడ్డాయి.

కేయూ హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి విద్యార్థిని తలకు గాయం

ABOUT THE AUTHOR

...view details