తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం జ్యుడిషియల్ విచారణ - నేడు మేడిగడ్డ ఆనకట్ట పరిశీలించనున్న జస్టిస్ పీసీ ఘోష్ - Judicial Inquiry On Kaleshwaram - JUDICIAL INQUIRY ON KALESHWARAM

Judicial Inquiry On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నేడు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనున్నారు. హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ సోమవారం రోజున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో సమావేశమయ్యారు. విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

NDSA Committee On Medigadda
Judicial Inquiry On Kaleshwaram Project (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 7:13 AM IST

Updated : May 7, 2024, 12:24 PM IST

Justice PC Ghosh Visits Medigadda Today :మేడిగడ్డ బ్యారేజికి మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నేషనల్‌ డ్యాం సేప్టీ అధారిటీ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆ బ్యారేజీలను పరిశీలించడంతో పాటు నీటి పారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో విస్తృతంగా చర్చించింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండటం వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మత్తులు చేయకపోతే బ్యారేజీకి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున సర్కారు విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను సమర్పించింది.

తాత్కాలిక పనులతో పాటు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందులో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌కు షీట్‌ పైల్స్‌ వేసి గ్రౌటింగ్‌ చేయాలని, రాఫ్ట్‌ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకొని చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కోరినట్లు తెలిసింది. పంపుహౌస్‌లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైనా భేటీలో చర్చించినట్లు తెలిసింది. ఆనకట్టల దిగువన నీటి వేగానికి తగ్గట్టుగా చర్యల విషయంలో డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించినట్లు తెలిసింది.

మేడిగడ్డ ఆనకట్టలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ - ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు - Judicial Inquiry on Kaleshwaram

Justice PC Ghose Committee Visit Medigadda :మేడిగడ్డలో 7 బ్లాకు మాత్రమే నష్టం వాటిల్లిందా మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు పలు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. తుది నివేదిను ఎన్డీఎస్ఏ జూన్‌లో అందించనుంది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నేడు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనున్నారు. హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్‌తో భేటీ అయ్యారు.

విచారణ ప్రక్రియకు చెందిన అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో ఆనకట్ట, దెబ్బతిన్న పియర్స్‌ పరిశీలించి ఇంజనీర్ల ద్వారా అవసరమైన వివరాలు తీసుకోనున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని రామగుండం ఎన్టీపీసీ అతిధి గృహానికి వెళ్తారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

కాళేశ్వరంపై విచారణలో కమిషన్​కు సాయమందించేందుకు మూడు బృందాలు - త్వరలో నియామకం - Judicial Inquiry On Kaleshwaram

'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram

Last Updated : May 7, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details