ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్‌ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు - Amaravati works

Jungle Clearance Works Going on Fast in Amaravati: రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు వంద జేసీబీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముందే అమరావతిలో పనులు ముమ్మరం చేయడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని అక్కడి ప్రజలు అంటున్నారు.

amaravati_works
amaravati_works (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 12:30 PM IST

Updated : Jun 10, 2024, 3:01 PM IST

Jungle Clearance Works Going on Fast in Amaravati:రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజా రాజధాని అమరావతికి కళ సంతరించుకుంది. జంగిల్‌ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 109 కి.మీ నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను తొలగిస్తున్నారు. ఈ నెల 12న అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతి రూపు మార్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. ఈ పనులను సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ (CRDA Commissioner Vivek Yadav) పర్యవేక్షిస్తున్నారు. వందల జేసీబీలు రంగంలోకి దిగి రేయింబవళ్లనే తేడా లేకుండా ముళ్లకంపలను తొలగిస్తూ శుభ్రం చేస్తున్నాయి. రాజధాని పనుల్లో కదలికపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముందే అమరావతిలో పనులు ముమ్మరం చేయడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని అంటున్నారు.

యుద్ధ ప్రాతిపదికన పూర్తి:రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదటి విడతలో పూర్తి చేయనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్‌ యాదవ్ తెలిపారు. 90 శాతంకు పైగా పూర్తైన భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు ఇక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపైన దృష్టి సారించామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అమరావతిలో అభివృద్ధి పనులు చేపడతామాని వివేక్ యాదవ్ తెలిపారు.

Last Updated : Jun 10, 2024, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details