Joinings to TDP From YSRCP: ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని అనుగొండ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు రామలింగం ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రామలింగం వైసీపీని వేడి తన వెయ్యి మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీలో తమకు ఎలాంటి గౌరవం దక్కనందుకు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు రామలింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దస్తగిరి, కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడులో వంద కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. వారికి బీవీ జయనాగేశ్వరరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కోసం తెలుగుదేశంలో చేరుతున్నారని జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఉమ్మలపేటకు చెందిన 50 మంది యువత నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు దక్కుతాయని టీడీపీలో చేరినట్లు యువత తెలిపారు. జగన్ ను నమ్మి గెలిపిస్తే మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ ను గద్దె దింపుతామని హెచ్చరించారు.
చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక - YCP WIPED OUT IN CHILAKALURIPETA
శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మార్కెట్ యార్డు ఛైర్మన్ ఈశ్వర్ రెడ్డి, చీకటిమానిపల్లి సర్పంచి రామాంజులమ్మ, ఎంపీటీసీ మాధవరెడ్డితోపాటు మరికొందరు వైసీపీను వీడి టీడీపీలో చేరారు. వారికి కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని నేతలు తెలిపారు. చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలరని టీడీపీలో చేరినట్లు వివరించారు. కందికుంట వెంకటప్రసాద్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
పేదరికంలో పుట్టి ఉన్నతస్థాయికి ఎదిగిన తనకు పేదల సమస్యలు తెలుసని మాజీమంత్రి నారాయణ అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పేదల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు 45వ డివిజన్ వైసీపీ నాయకుడు దార్ల వెంకటేశ్వర్లు ఆయన అనుచరులు తెలుగుదేశంలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి నారాయణ ఆహ్వానించారు. పేదల సొంతింటి కలను తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని నారాయణ హామీ ఇచ్చారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి కాలువ కట్టపై పేదల నివాసాలు తొలగిస్తామని వైసీపీ నాయకులు విషప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రామ్మూర్తినగర్ రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న దాదాపు 80 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
టీడీపీలో మెుదలైన జోష్- వైఎస్సార్సీపీ నుంచి భారీగా వలసలు
అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు అయితే అరాచకానికి నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాపట్లజిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు పెద్దఎత్తున చేరారు. వారికి ఏలూరి సాంబశివరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా ఉండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం అర్జునుడు పాలెం గ్రామానికి చెందిన రెడ్డి జన సంఘానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
జగన్కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ- లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురాజు సతీమణి