తెలంగాణ

telangana

ETV Bharat / state

'డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు?' - జన్వాడ ఫామ్​హౌస్ కేసులో విజయ్​ మద్దూరి విచారణ - JANWADA FARMHOUSE CASE UPDATE

జన్వాడ ఫామ్​ హౌస్​ పార్టీ కేసు - నాలుగు గంటలపాటు విజయ్‌ మద్దూరిని విచారించిన పోలీసులు - పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో విచారణ

POLICE INVESTIGATE VIJAY MADDURI
JANWADA FARM HOUSE CASE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 2:49 PM IST

Updated : Nov 6, 2024, 3:31 PM IST

Janwada Farmhouse Case : జన్వాడ ఫామ్ హౌస్​ పార్టీ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. మోకిలా పోలీసుల ఎదుట విజయ్ మద్దూరి(ఏ2) హాజరయ్యారు. కొన్ని రోజులుగా విచారణకు హాజరుకాని విజయ్ మద్దూరి ఈ రోజు(నవంబర్​ 06)న పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన్వాడ ఫామ్ హౌస్​ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్​పాకాలకు విజయ్ స్నేహితుడు. ప్రస్తుతం విజయ్​ మద్దూరిని పోలీసులు ఈ వ్యవహారంలో విచారించారు. ఫామ్​ హౌస్​ పార్టీలో పాల్గొన్న విజయ్​ మద్దూరి సాంపిల్స్‌ను పరీక్షించగా ఆయన డ్రగ్స్​ తీసుకున్నట్లు తేలింది.

పోలీసుల ప్రశ్నలు ఇవే : పార్టీలో మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? ఇప్పటివరకు ఎన్నిసార్లు మాదకద్రవ్యాలు తీసుకున్నారు? అనే కోణంలో పోలీసులు విజయ్​ మద్దూరిని ప్రశ్నించినట్లు తెలిసింది. దాదాపుగా నాలుగు గంటల పాటు విజయ్‌ మద్దూరిని పోలీసులు విచారణ చేశారు. గతంలో రాజ్‌పాకాల ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన పలు సమాధానాల ఆధారంగా కూడా విజయ్‌ మద్దూరికి పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

4 గంటల విచారణ అనంతరం మోకిల పోలీస్‌స్టేషన్‌ నుంచి విజయ్‌ మద్దూరి వెళ్లిపోయారు. రాజ్ పాకాల ఫామ్​ హౌస్​లో జరిగిన లిక్కర్ పార్టీలో విజయ్​ మద్దూరికి పరీక్ష నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్​ హౌస్​ లిక్కర్​ పార్టీ కేసుతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర చర్చలకు దారితీసింది.

జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసు - 7గంటల పాటు రాజ్​ పాకాల విచారణ

ప్రకంపనలు రేపుతోన్న ఫామ్ హౌస్​ పార్టీ : పరారీలో రాజ్‌ పాకాల - పలువురు బీఆర్​ఎస్​ నేతలు అరెస్ట్

Last Updated : Nov 6, 2024, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details