Janasena Party Glass Symbol Issue in High Court: జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు కోసం ముందుగా దరఖాస్తు చేసుకుందని, చట్ట నిబంధనలకు అనుగుణంగా గాజు గ్లాసు గుర్తును కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. మొదట వచ్చిన వారికి మొదట విధానంలో పార్టీ గుర్తు కేటాయించామని ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. తమ నిర్ణయంలో నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య ఈ విషయంపై స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలన్నారు. పార్టీ గుర్తుల కేటాయింపు కోసం జనసేన పార్టీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యూలర్) పార్టీ చేసుకున్న దరఖాస్తులను కౌంటర్‌తో జత చేయాలని స్పష్టం చేశారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు.
కలిసికట్టుగా పని చేద్దాం - టీడీపీ-జనసేనను గెలిపిద్దాం: నాగబాబు
Central Election Commission Reported to High Court:తమ దరఖాస్తును పట్టించుకోకుండా జనసేనపార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యూలర్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం. శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్ వాదనలు వినిపించారు. ఎన్నికల గుర్తులు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ గుర్తు కోసం గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదిన చేసిన దరఖాస్తును ఈసీ పట్టించుకోలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిందన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించి, గాజు గ్లాసును ప్రచారానికి వినియోగించుకోకుండా జనసేనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.