ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎస్‌ కుమారుడు ఉత్తరాంధ్రలో భూమి కాజేశారు - అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధం: పీతల మూర్తి యాదవ్‌ - murthy yadav on ap cs jawahar reddy - MURTHY YADAV ON AP CS JAWAHAR REDDY

Janasena Murthy Yadav on AP CS Jawahar Reddy: సీఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడి బినామీలతో కలిసి 800 ఎకరాలు కాజేశారని ఆరోపణలు చేసిన జనసేన నేత పీతల మూర్తియాదవ్ ఆధారాలను మీడియా ముందు బహిర్గతం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రొద్బలంతో విశాఖ, విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చేశారని చెప్పారు. ఫలితంగా పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవం అయితే ఏ శిక్షకైనా సిద్ధమని మూర్తి యాదవ్‌ స్పష్టం చేశారు.

Murthy Yadav on AP CS Jawahar Reddy
Murthy Yadav on AP CS Jawahar Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 4:33 PM IST

Janasena Murthy Yadav on AP CS Jawahar Reddy: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడు బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. తాను చెప్తున్న అంశాలకు తగిన ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు బహిర్గతం చేసారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ, విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చేశారని, ఫలితంగా పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని దీనిపై సీబీఐ లేదా సెట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడిని ముందే పంపి, అగ్రిమెంట్లు చేసుకుని, ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ముందే ఇచ్చారని ఆరోపించారు. భోగాపురం సమీపంలోని కంచెరు గ్రామంలో అనుమతులు ఇస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మీ ప్రొసీడింగ్స్ ఇచ్చారని అన్నారు. అదే విధంగా పూసపాటి రేగ మండలంలో ఎరుకొండ గ్రామంలో, చిన్న బత్తిలి వలస, కోవాడా, పొన్నాడ గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తెలిపారు.

సీఎస్‌ కుమారుడు ఉత్తరాంధ్రలో భూమి కాజేశారు - అవాస్తవం అయితే ఏ శిక్షకైనా సిద్ధం: పీతల మూర్తి యాదవ్‌ (ETV Bharat)

విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే: మూర్తియాదవ్‌ - Murthy Yadav Allegations on CS

విశాఖ భీమిలి మండలం పద్మనాభంలోనూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారన్న మూర్తి యాదవ్, ఐనాడ, బుద్ధివలస, కొరడామద్ది, నరసాపురం, పాండ్రంగి, తిమ్మాపురం గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు చెప్పారు. ఇక ఆనందపురంలో 700 ఎకరాలలో ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారని ఆరోపించారు. బాకులపాడు, చందక, గండిగుండం గిడిజాల, బొట్టుపల్లి, పందలపాక గ్రామాల్లో ఉన్న భూములకు సర్టిఫికెట్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు భూమి రైతుల పేరు మీద ఉందో లేదో సీఎస్ జవహర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. నా ఎస్సీ, ఎస్టీలు అనే ప్రభుత్వం ఇదేనా అని ప్రశ్నించిన మూర్తియాదవ్, బలహీనవర్గాల రైతులకు చేసే న్యాయం ఇదేనా అంటూ మండిపడ్డారు. మొత్తం వైఎస్సార్సీపీ నాయకులు విశాఖ, విజయనగర జిల్లాలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ తీసుకుని ఉత్తరాంధ్రను దోచేశారని విమర్శించారు. నిజంగా సీఎస్ జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జవహర్ రెడ్డి చీప్ సెక్రటరీ - ఏపీ సీఎస్​పై సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు - TDP Somireddy Comments on CS

జీవో 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల మీద విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలు వేగంగా జరిగేలా చేశారని, రైతుల చేతిలో ఈ భూములు లేవని త్వరలో దీని వెనక ఉన్న ఎమ్మార్వో పేర్లు బయట పెడతానని మూర్తి యాదవ్ తెలిపారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుతం రాదని తెలిసి, రహస్యంగా ఈ భూ లావాదేవీలను సీఎస్ జవహర్ రెడ్డి జరిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే భోగాపురం మీదే సీఎస్​కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.

సీఎస్‌ నియంత్రణలో ఈసీ? - అధికార పార్టీకి కలిసొచ్చేలా జవహర్‌రెడ్డి నిర్ణయాలు! - Criticism that EC

ABOUT THE AUTHOR

...view details