Murthy Yadav Allegations on CS Jawahar Reddy :ఉత్తరాంధ్రలో 2 వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన కార్పొరేటన్ పీతల మూర్తియాదవ్‌ఆరోపించారు. జవహర్‌రెడ్డి సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారన్న ఆయన 800 ఎకరాలకు పైగా భూములకు డీల్ జరిగిందని తెలిపారు. ఎన్నికల హింసపై పర్యవేక్షించకుండా సీఎస్ విశాఖలో భూవ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని మూర్తియాదవ్ మండిపడ్డారు.
CS Jawahar Reddy Encroaching Assigned Lands in Visakhapatnam? :4 రోజుల క్రితం రిజిస్ట్రేషన్లకు వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్షించారని పీతల మూర్తి యాదవ్ తెలిపారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా భారీగా భూఅక్రమాలకు తెరలేపారని, 400 ఎకరాల ఎస్సీ, బీసీల అసైన్డ్ భూములను బినామీల పేరిట చేజిక్కించుకున్నారని, భోగాపురం విమానాశ్రయం చుట్టూ వందల ఎకరాలపై జవహర్‌రెడ్డి కన్నేశారని ఆరోపించారు. విశాఖ, విజయనగరం జిల్లా భూములపై సీఎస్ కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారని అన్నారు.