ఐటీఐల అభివృద్ధికి నడుం బిగించిన సర్కార్ - ఇంటర్ స్థాయిలోనే సాంకేతిక నైపుణ్యాలు అందించడమే లక్ష్యం! - itis as SDC today Prathidhwani - ITIS AS SDC TODAY PRATHIDHWANI
ITIs Advanced Technology Centers in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభించింది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Jun 20, 2024, 10:27 AM IST
ITIs as Skill Development Centers Prathidhwani : ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి పూనుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా తీర్చిదిద్దే పని మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 4 ఏటీఎస్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఎలాంటి కోర్సులు అవసరం? పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యాసంస్థలను ఎలా అభివృద్ధి చేయవచ్చు? విద్యార్థులు, యువతకు స్థానికంగా, అంతర్జాతీయంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలంటే విద్యా విధానంలో రావాల్సిన మార్పులు ఏంటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.